వార్తలు (News)

తాంబూలానికేకాదు తమలపాకు. తమలపాకులేని పూజా,శుభకార్యం ఉండనే ఉండవు.ఆకు పూజలో తులసీదళం తరువాత స్ధానం తమలపాకుదే!

తాంబూలానికేకాదు తమలపాకు.
తమలపాకులేని పూజా,శుభకార్యం ఉండనే ఉండవు.ఆకు పూజలో తులసీదళం తరువాత స్ధానం తమలపాకుదే!
తామలపాకుల్లో ఆరోగ్యాన్ని కాపాడే సుగుణాలు ఎన్నోఉన్నాయి.అందుకే మనపూర్వికులు ప్రతిశుభకార్యంలోను తమలపాకులు తప్పనిసరిగా వాడేవారు.ఇదేసంప్రదాయం ఇప్పటికి కొనసాగుతుంది.ఇలా ప్రపంచవ్యాప్తంగా తమలపాకును వాడుతున్నారు.వీటి ఆచార వ్యవహరాలతో పాటు ఆరోగ్యవిషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం!
తమలపాకు తాంబూలంగాతీసుకుంటే జీర్ణప్రక్రియకు దోహదపడుతుంది అని అందరికి తెలిసిందే.తమలపాకు ఎడమచేతితో స్వీకరించకూడదు.
మలేషియాలో ఇరువురినడుమ తగవు తీర్చి సమాధానపరచడానికి వాళ్లు ఇరువురు తమలపాకులు మార్చుకుంటే స్నేహితులుగా మారతారు.
నెదర్ లాండ్ దేశంలో ఖైదీలకు చెసాలలో కలరా,మలేరియా వంటి వ్యాధులు రాకుండాఉండేందుకు తమలపాకులు పంచేవారట.మయన్మర్ దేశంలో ఉరిశిక్షపడిన ఖైదీలకు శిక్షఅమలుపరిచేముందు ఆఖైదికి తమలపాకులు అందించే ఆచారంఉంది.ప్రపంచవ్యాప్తంగాఆయుర్వేదంలో తమలపాకుకు స్ధానంఉంది.శుభకార్యాలలో గుమ్మానికి మామిడి ఆకు లేక తమలపాకు తోరణం కట్టడం మనకుతెలిసిందే. తమలపాకులో ఎముకల ధృఢత్వానికి తోడ్పడే కాల్షియం,ఫోలిక్ యాసిడ్,విటమిన్ ఏ,సి లు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి.పైబర్ కూడాఉండటం వలన జీర్ణవ్యవస్త చక్కగా పని చేస్తుంది.ఇదీ యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది. దీనివలన వృధాప్యపుఛాయలుకనిపించవు.వంటనూనెలు,నేయి నిల్వలుగా ఉండాలంటే వాటిలో తమలపాకు వేయాలి.నోటిదుర్వాసన పోవాలంటే అయిదు తమలపాకులలో రెండుగ్లాసుల నీరు పోసి ఒకగ్లాసు అయ్యేదాక మరిగించి చల్లరిన తరువాత పగటి భోజనానంతరం తాగాలి దగ్గుకూడా తగ్గుతుంది.నోటిపూతకు తమలపాకు నమిలితే తగ్గిపోతుంది. తమలపాకురసం,పాలు,నీళ్ళు కలుపుకునితాగితే కిడ్నీ వ్యాధికి దివ్యంగా పనిచేస్తుంది.తమలపాకు మితంగా తీసుకోవడంవలన వీర్యం అభివృధ్ధి చెందుతుంది పిల్లలకు ఛాతిపై గోరువెచ్చని తమలపాకులు వేయడంవలన వారికి జలుబునుండి ఉపశమనం కనిపిస్తుంది. తామమర,దురదా వంటి చర్మవ్యాధులకు పసుపు తమలపాకు కలిపి నూరి అక్కడ రాస్తే దివ్యంగా పని చేస్తుంది. తమలపాకు రసం గొంతుభాగంలో రుద్దితే గొంతులో నస, గొంతుమంట,గొంతు ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం పొందవచ్చు. తమలపాకు రసం కొబ్బరినూనె కలిపి వెన్నుముకపై రాసుకుంటే నొప్పికి ఉపశమనం కలుగుతుంది.చెవినొప్పికి తమలపాకు రసం చుక్కలువేస్తే చెవిపోటు తగ్గుతుంది.తమలపాకు రసాన్ని గాయాలపైపూస్తే త్వరగా గాయాలు మానుతాయి. ప్రతిరోజు తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగానూరివేడినీళ్ళతో తీసుకుంటే బోదకాలువ్యాదికి ఉపశమనం కలుగుతుంది.తమలపాకును సంసృతంలో నాగవల్లి అంటారు. తమలపాకులో ‘చెవిరాల్’ఇది చెడు బ్యాక్టిరియాతో పోరాడుతుంది. సంతానం పొందేవారు ఈనెతో తమలపాకు తినకూడదు.అధికరక్తపోటు ఉన్నవారు తాంబూలానికి దూరంగా ఉండాలి.తమలపాకుతో పుగాకు కలిపిన పదార్ధాలు కలిపి వాడితే నోటి క్యాన్స్ ర్ వచ్చె అవకాశం ఎక్కవ ఉంది.అధికబరువుతో బాధపడేవారు తమలపాకుతో మిరియాలు కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.తలనోప్పికి తమలపాకు రసం ముక్కుల్లో వేసుకుంటే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.తమలపాకు ముద్దగానూరి తలకు పట్టించి గంట తరువాత,కుంకుళ్ళతో స్నానంచేస్తే చుండ్రునుండి విముక్తి లభిస్తుంది.ఇష్టమైన పదార్ధలతో భోజనం అధికంగా తిన్నతరువాత భుక్తాయాసం నుండి ఉపశమంనంపొందాలంటే తాంబూలసేవనమే శరణ్యం.
కీళ్లనొప్పులకు నొప్పి,వాపు ఉన్నచోట తమలపాకును ఉంచితే ఉపశమనం లభిస్తుంది.తమలపాకును ఆవనూనెలో నానబెట్టి కొద్దిగావేడి చేసి పిల్లల ఛాతిపై రుద్దితే దగ్గు,ఆయాసం లాంటి శ్వాస రుగ్మతలకు ఉపశమనం కలుగుతుంది. తలనొప్పి ఉన్నవారు లేత తమలపాకు నుదుటిపై వేస్తే ఉపశమనం కలుగుతుంది.తమలపాకులో ఈనలుబాగా తెలిసి చేతికితగిలేలాఉంటే అది మగతమలపాకు.సున్నితంగా ఈనెలు చేతికి తగలకుండా ఉంటే అది ఆడతమలపాకు.ఏతమలపాకు అయినాఅది మనఆరోగ్యనికి తల్లివంటిదే!
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.