హైదరాబాద్

ధైర్యంగా గళమెత్తి పోరాటం చేయటమనేది తెలంగాణ ప్రజల్లో ఉందని..కళ్లెదుట కనిపించే సమస్యలపై ప్రభావశీలంగా మాట్లాడాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు.

యువకులు, విద్యార్థులు…రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్ళి ప్రజలకు అండగా ఉండాలని కోరారు.

ఇటీవల నియమించిన జనసేన పార్టీ తెలంగాణ విభాగం విద్యార్థి, యువజన కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర సభ్యులతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

పార్టీ ప్రతినిధులకు నియామక పత్రాలు అందించారు. మన చుట్టూ ఉన్న ప్రజల కోసం బలంగా నిలబడి గొంతు వినిపించాలని పవన్‌ సూచించారు.

ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే దిశగా పని చేయాలన్నారు.

సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ తరఫున క్రియాశీలకంగా వ్యవహరించాలని.., తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా స్పందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జ్ ఎన్.శంకర్ గౌడ్, ముఖ్య నాయకులు రామ్ తాళ్ళూరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్.రాజలింగం తదితరులు పాల్గొన్నారు.