ఇటీవల కాలంలో భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు తూర్పుగోదావరి జిల్లాకు కేంద్ర బృందం వచ్చింది. సౌరవ్ రాయ్ (జాయింట్ సెక్రటరీ) నేతృత్వంలో ఆయుష్ పునియా (అసిస్టెంట్ కమిషనర్), శ్రావణ్ కుమార్ సింగ్ (సూపర్ డెంటింగ్ ఇంజినీర్), ఆర్ బి కౌల్ (కన్సల్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్) సభ్యులు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగువానిలంక ఉద్యానవన, పాడైపోయిన పువ్వుల పంటలను పరిశీలించారు. కూరగాయలు, అరటి పంటలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరసగా వరదలు తుఫాను రావడంతో చేతికంది వచ్చిన పంట పూర్తిగా పాడైపోతుందని లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని రైతు కేంద్ర బృందానికి తెలిపారు. ఎకరా భూమికి యాభై నుండి డెబ్బై వేల రూపాయలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నామని అరటి పంట సాగు చేసేందుకు మరో లక్ష రూపాయలు అవుతుందని, ఈ మొత్తo అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నామని తుఫాను కారణంగా పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు అనంతర పంటల శుభ్రం చేసుకుని మరల అప్పు చేసి విత్తనాలను కొనుగోలు చేసి పంట వేయగా మరల తుఫాను రావడంతో విత్తనాలు పూర్తిగా పాడైపోయి నష్ట పోయామని అన్నదాతలు వివరించారు. అలాగే కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి బడుగువానిలంకలో వరదలు తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. అలాగే తుపాను భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను జొన్నాడ వద్ద కేంద్ర బృందం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్ కలెక్టర్ కౌశిక్, ఆలమూరు మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కన్వీనర్ తమన్ శ్రీను, తహసీల్దార్ జి లక్ష్మిపతి, మండల ప్రజాపరిషత్ ఏవో టీవీ సురేందర్రెడ్డి, ఆర్ఐ జానకి రాఘవ, రాజమహేంద్రవరం (కడియం) హార్టీకల్చర్ హెచ్ఓ సుధీర్ బాబు, నాయకులు అడబాల వీర్రాజు, వీర రాజు, దూలం సత్యనారాయణ పలువురు రైతులు అధికారులు పాల్గొన్నారు.