వార్తలు (News)

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి


తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో ప్రజా పాదయాత్రకు వచ్చిన రాజ్యలత అనే మహిళా స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే గమనించిన ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవిగారు ఎమ్మెల్యే పదవిని పక్కన పెట్టి వృత్తి ధర్మం పాటించారు. వృద్దురాలికి ప్రధమ చికిత్స అందించి భరోసా కల్పించారు. జాగ్రత్తగా ఉండాలంటూ రాజ్యలతకు సూచనలు చేశారు. హుటాహుటిన ఆమెను వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని నాయకులకు ఆదేశించారు. వృద్దురాలికి సకాలంలో వైద్యం అందించడం పట్ల పెద్ద మనసు చాటుకున్నారంటూ స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.