వార్తలు (News)

మాలల అభివృద్ధి కి కృషి చేస్తాను : రాకోటి చంద్రమోహన్

శ్రీకాకుళం టెక్కలి పశ్చిమ వాహిని : భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ కృషి ఫలితంగానే రాజకీయ, సామాజిక, ఆర్థిక ఫలాలు బడుగు, బలహీన వర్గాలకు చేరాయని, మాలలకు మాత్రం తీరని అన్యాయం జరుగుతోందని మాలలకు తగిన గుర్తింపు తీసుకువచ్చేందుకు తాను అలుపెరగని పోరాటం చేస్తానని టెక్కలి నియోజకవర్గ అధ్యక్షులు రాకోటి చంద్రమోహన్ పేర్కొన్నారు.విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మాల ఐక్య వేదిక జాతీయ ముఖ్య నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశం లో టెక్కలి నియోజకవర్గ అధ్యక్షులు రాకోటి చంద్రమోహన్ పాల్గున్నారు.ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని సూచించారు. అంబేడ్కర్‌ ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ అనుకున్నది సాధించడానికి సమష్టిగా పనిచేయాలని పిలునిచ్చారు.మాలలకు ఎలాంటి ఆపద వచ్చిన వారికి అండగా ఉంటానని, ఎప్పుడైనా తనను సంప్రదిస్తే సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు చంద్రమోహన్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు మాలలను గుర్తించాలంటే ఐక్యంగా ఉన్నప్పుడే సాధ్యపడుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మాల ఐక్య వేదిక జాతీయ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలను ఎన్నుకోవడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీర్మానాలను ఆమోదించడం జరిగింది.
తీర్మానములు:
1. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, శిరోముండనాలు నివారణకు ప్రభుత్వం వారు
తక్షణమే దళితుల రక్షణకు చర్యలు తీసుకోవాలి.
2. ఎస్.సి.ఎస్.టి అట్రాసిటీ కేసులలో విచారణను త్వరితగతిన పూర్తిచేసి దోషులపై కఠిన చర్యలు చేపట్టాలి
3. ఎస్.సి.ఎస్.టి కార్పొరేషన్ సబ్సడీ రుణాలను తక్షణమే మంజూరచేయాలి.
4. ఎస్.సి.ఎస్.టి సప్లాన్ నిధులు వేరే ప్రభుత్వ పధకాలకు మళ్లించకుండా, దళిత, గిరిజనవాడల
అభివృద్ధికే వినియోగించాలి.
5. ఎస్.సి.రిజర్వేషన్ వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీలను ఎన్నికలలో ఓడించాలి.
6. భూమికొనుగోలు పధకం కొనసాగించాలి.
• బెర్ఎవైలబుల్ స్కూల్ స్కీం పధకం కొనసాగించాలి.
+ కులాంతర వివాహాల ప్రోత్సాహం నిధులువిడుదల చేయాలి.
* అంబేధ్కర్విదేశీ విద్య స్కీం కొనసాగించాలి.
• దళిత విద్యార్థులు పోటీపరీక్షలు సిద్ధపడేందుకు ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్స్ కొనసాగించాలి.
• దళిత ఉద్యోగుల స్టడీలీవ్ కొనసాగించాలి.
+ బుకబ్యాంకు స్కీం నిధులు విడుదల చేయాలి.
• ఇళ్ళస్థలాలకోసం దళితుల అసైన్డ్ భూములు తీసుకోరాదు.
7. క్రొత్తగా ఏర్పాటుచేస్తున్న అమలాపురం జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేధ్కర్ గారి పేరు,
కర్నూలు జిల్లాకు దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యగారి పేరుపెట్టాలి.
8. 500 మంది జనాభా దాటిన ప్రతీ దళితవాడను ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పాటుచేయాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.