👆 (పాతచిత్రం)
మైసూరు, న్యూస్‌టుడే : ప్రీవెడ్డింగ్‌ షూట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది.

ఫొటోలు తీసుకునేందుకు తెప్పలో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో యువ జంట నీటిపాలైంది. ఈ దుర్ఘటన సోమవారం మధ్యాహ్నం తలకాడులో చోటుచేసుకుంది. నీటిపాలైన యువ జంటను మైసూరు జిల్లా క్యాతమారనహళ్లికి చెందిన చంద్ర (28), శశికళ (20)గా గుర్తించారు.

వీరికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. 22న వివాహాన్ని ఖరారు చేశారు. ఈలోగా ప్రీవెడ్డింగ్‌ షూట్‌లో పాల్గొనేందుకు ఇద్దరూ సోమవారం తలకాడులోని కావేరి నదిలో తెప్పలో వెళ్తుండగా బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. తెప్పనడిపే సరంగు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. తలకాడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.