వార్తలు (News)

రూ.51.39 కోట్లతో మరో 51,390 మందికి ‘జగనన్న చేదోడు’ • రాష్ర్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ

 
• కొత్తగా అర్హులైన మరో రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు 51,390 మంది గుర్తింపు
• ఆన్ లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో రూ.10 వేల చొప్పున్న జమ
• ఈ ఏడాది రెండు విడతలుగా 2,98,430 మంది లబ్ధిదారులకు రూ. 298.43 కోట్లు అందించామన్న మంత్రి
• బడుగు, బలహీన కులాలను గుర్తించిన సీఎం…జగనే : మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
 
విజయవాడ, నవంబర్ 10 :  విజయవాడలోని ఆర్ అండ్ బి భవన సముదాయంలో మంగళవారం జగనన్న చేదోడు 2020 కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు.  అర్హత గల ప్రతి ఒక్కరికీ సంతృప్త స్ధాయిలో అందించాలన్న లక్ష్యంలో భాగంగా జగనన్న చేదోడు పధకం కింద మరో  51,390 మంది లబ్దిదారులను గుర్తించి, ఒక్కొక్కరికీ రూ. 10 వేల చొప్పున ఈ రోజే రూ. 51.39 కోట్లను లబ్దిదారుని అకౌంట్ కి  నేరుగా బదిలీ చేస్తున్నామని తెలిపారు.
పాదయాత్రలో చెప్పిన ప్రతీ హమీ అమలులో భాగంగా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ఈ ఏడాది జున్ పదో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. ఆనాడు తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 2,47,040 మంది లబ్ధిదారులకు రూ. 10,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో రూ. 247.04 కోట్లు జమ చేశామన్నారు. రాష్ట్రంలో ఇంకా అర్హులైన లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం ఆర్జీలు స్వీకరించిదన్నారు. దీనిలో భాగంగా మరో 51,390 మంది లబ్దిదారులను గుర్తించి, రూ. 10 వేల చొప్పున రూ. 51.39 కోట్లను ఆన్ లైన్ ద్వారా బటన్ నొక్కి వాళ్ల అకౌంట్లోకి నేరుగా బదిలీ చేశామన్నారు. ఇలా ఈ ఏడాది రెండు విడతలుగా 2,98,430 మంది లబ్ధిదారులకు జగనన్న చేదోడు పధకం కింద రూ. 298.43 కోట్లు అందించామని తెలిపారు. లబ్ధిదారులకు ఏడాదికి రూ.10,000/- లు చొప్పున 5 సంవత్సరాలలో రూ.50,000/-లు వాళ్ల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తామన్నారు.
అర్హులకు మరో అవకాశం…
‘జగనన్న చేదోడు’ పథకం కింద లబ్ధి పొందేందుకు అన్ని అర్హ‌త‌లు క‌లిగి ఉండి అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ పేర్లు నమోదు చేసుకోనివారికి అనాడు సి.ఎం. వైయస్ జగన్మోహన్ రెడ్డి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారని, వార్డు, గ్రామ సచివాలయాల్లో వాలంటీర్ల ద్వారా అర్జీ పెట్టుకోవాలని సూచించారని మంత్రి తెలిపారు. తమ చెమటను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పధకాన్ని ప్రారంభిస్తున్నాం అని అనాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్న మాటను మళ్లీ గుర్తుచేస్తున్నానని,  తమ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ మాట ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా, భగవద్గీతగా భావిస్తూ, రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి… ప్రభుత్వం సహాయం అందిస్తోందని తెలిపారు.
సిఫార్సులకు తావులేకుండా పథకాల వర్తింపు…
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలి… కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సిఫార్సులు, మధ్యవర్తులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదన్నదే సీఎం శ్రీ జగన్ లక్ష్యం అని అన్నారు. సంక్షేమ క్యాలెండర్ ను ప్రకటించి మరీ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కొనియాడారు.  అధికారంలో ఉన్నప్పుడు బీసీల ఆత్మాభిమానంతో ఆడుకుని, నేడు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని అన్నారు. చంద్రబాబు ఎన్ని పాచికలు వేసినా, ఎన్ని కుట్రలు పన్నినా బీసీలు ఎవరూ నమ్మడం లేదని తెలిపారు. పూలే, అంబేద్కర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన దిశగా సీఎం శ్రీ జగన్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నాడు-నేడు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోందని, మరి ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి, అర్హులై ఉండి పథకానికి సకాలంలో దరఖాస్తు చేసుకోకుండా ఎవరైనా మిగిలిపోతే.. వారికి కూడా లబ్ధిచేకూర్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మరలా నెల రోజులు గడువు ఇచ్చి.. అర్హులను ఎంపి చేస్తున్న తీరుని రాష్ట్రంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు. 
నాడు – చంద్రబాబు సంక్షేమ పథకాలను ఎగ్గొట్టాలి, ఏ విధంగా లబ్ధిదారులకు ప్రయోజనాలు అందకుండా కోతలుపెట్టాలి అని నిరంతరం ఆలోచనలు చేసేవారని, కానీ నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో లబ్ధిదారులను గుర్తించడం, ఒకవేళ ఏవరైనా అప్లై చేసుకోకపోయిన, అర్హత కలిగి ఉండికూడా ఏ ఒక్కరికైనా లబ్ధి చేకూరకపోతే, వారందరికీ మళ్లీ అవకాశం కల్పించి, లబ్ధిచేకూర్చాలన్న ఆశయంతో జగనన్న ప్రభుత్వం ముందుకెళుతుందని అన్నారు.
అధికారం పోయిన తర్వాత మొక్కుబడిగా పార్టీ పదవులు ఇచ్చి, బీసీలకు ఏదో చేశానని చంద్రబాబు గొప్పలు చెబుతున్నాడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు అధికారిక పదవులు ఇవ్వలేదు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. . అధికారంలో ఉంటే ఒక విధంగా, అధికారం పోతే మరో విధంగా అన్నింటా వ్యవహరించే చంద్రబాబుది ఇక్కడ కూడా రెండు కళ్ళ సిద్ధాంతమని పేర్కొన్నారు. 2014 మ్యానిఫెస్టోలు బీసీలకు 120 హామీలు ఇచ్చి కనీసం పది శాతం కూడా హామీలు అమలు చేయలేని టిడిపి పార్టీ అని అన్నారు. చంద్రబాబు సబ్సిడీ రుణాలకు అదనంగా బ్యాంక్ అండ్ సబ్సిడీ నిబంధన పెట్టి బీసీల స్వయం వ్యాపారాలను దెబ్బ కొట్టారని అన్నారు. కుల చేతివృత్తుల వారికి ఆధునిక పనిముట్లు ఇవ్వకుండా కాలం చెల్లిన నాసిరకం పనిముట్లు ఇస్తూ బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా జెండాలు మోసే కూలీలుగా టిడిపి వాడుకుంటుందని అన్నారు. 
`ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి బడుగు, బలహీనవర్గాల వారికి అధికారం దక్కాలన్న లక్ష్యంతో.. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, 56 ఛైర్మన్లను, 672 మంది డైరెక్టర్లను చేసి బీసీ వర్గాలు తమను తాము పాలించుకునేలా ఆత్మగౌరవాన్ని ఇచ్చారని అన్నారు. 
ఈ కార్యక్రమంలో  నాయీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ సిద్ధవటం యానాదయ్య, స్పేషల్ ఛీప్ సెక్రటరీ బీసీ వెల్పేర్ డిపార్ట్ మెంట్ శ్రీ ప్రవీణ్ కుమార్, ఐ.ఏ.ఎస్., బీసీ కార్పోరేషన్ అధికారులు మరియు విజయవాడ, గుంటూరుకు చెందిన లబ్దిదారులు పాల్గోన్నారు. వారి సమక్షంలో మంత్రి డెమో చెక్కును రిలీజ్ చేసి అందించారు.  
 
ఎం. సురేష్, పి.ఆర్వో టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి
close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.