వార్తలు (News)

💫ఇండేన్ గ్యాస్ ఇండియా మొత్తం ఒకే నంబర్ చేశారు మీ సిలెండర్ ఇక Whatsapp లో బుక్ చేసుకోవచ్చు ! గ్యాస్ బుక్ చేసుకొనే నెంబర్ మరిన తరువాత సిలెండర్ బుక్ చేసుకోవడానికి సులభమైన మార్గం

 గ్యాస్ అయిపోయిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సిలిండర్ బుక్ చేయడం ఇబ్బందిగా ఉందా? అయితే ఇకమీదట అంత కష్టపడాల్సిన పనిలేదు. ఒక Whatsapp ద్వారా కూడా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. నవంబర్ ఒకటో తేదీ నుండి ఇండేన్ గ్యాస్ వాడుతున్న వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీనికోసం మీరు చేయవలసిందల్లా మొట్టమొదట మీ ఫోన్లో 7588888824 అనే నెంబర్‌ని మీకు గుర్తుండే పేరుతో సేవ్ చేసుకోవాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లో మాత్రమే ఈ సదుపాయం వాడుకోటానికి సాధ్యపడుతుంది. నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత Whatsappలో పైన చెప్పబడిన నెంబర్కి REFILL అనే మెసేజ్ పంపిస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మీ సిలిండర్ బుక్ అయిపోతుంది. సిలిండర్ బుక్ చేసిన తర్వాత.. Delivery Authentication Code ఆధారంగా డెలివరీ జరుగుతుంది. దేశవ్యాప్తంగా వంద నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ పద్ధతి ద్వారా మీరు సిలిండర్ బుక్ చేసిన తర్వాత మీ ఫోన్ కి ఒక ఓటిపి వస్తుంది. గ్యాస్ డెలివరీ సమయంలో వచ్చిన వ్యక్తికి మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ తెలియజేస్తే మాత్రమే సిలిండర్ ఇవ్వబడుతుంది. గ్యాస్ బుకింగ్ కోసం మీరు వాడుతున్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ప్రస్తుతం పనిచేయడం లేదా? లేదా వేరే నెంబర్ మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు సిలిండర్ డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి దగ్గర ఉండే ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ ద్వారా.. అప్పటికప్పుడు మీరు వాడుతున్న వేరే మొబైల్ నెంబర్‌ని రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ గా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. డెలివరీ పర్సన్ మొబైల్ అప్లికేషన్లో కొత్త నెంబర్ అప్డేట్ చేసిన వెంటనే ఇకమీదట కొత్త నెంబర్ మాత్రమే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ గా కొనసాగుతుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.