వార్తలు (News)

9-11-20 క్రైం న్యూస్

*ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. న‌లుగురు మృతి*

జ‌గిత్యాల‌: జ‌గిత్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. నిన్న రాత్రి ఓ కారు.. రోడ్డుపై ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న‌ న‌లుగురు మృతిచెందారు. మ‌రో ఇద్ద‌‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. హైద‌రాబాద్ నుంచి మ‌ల్లాపూర్ వెళ్తున్న కారు ఆదివారం రాత్రి కోరుట్ల మండ‌లం మోహ‌న్‌రావుపేట వ‌ద్ద ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు మ‌హిళ‌లు, మ‌రో ఇద్ద‌రు చిన్నారులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. కారు డ్రైవ‌ర్‌తోపాటు మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నాస్థలానికి చేరుకున్న పోలీసులు‌ క్ష‌త‌గాత్ర‌లును ద‌వాఖాన‌కు త‌రలించారు. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలిపారు. మృతులు మ‌ల్లాపూర్ వాసులు ర‌మాదేవి, ల‌త‌, చిన్నారులు శిరీష‌, చ‌ర‌ణ్‌గా గుర్తించామ‌న్నారు.
2
*డిజిట‌ల్ యాప్ పేరుతో 9 ల‌క్ష‌లు చోరీ*

ముంబై : డిజిట‌ల్ యాప్ పేరుతో 9 ల‌క్ష‌లు చోరీ చేసిన ఘ‌ట‌న మ‌హారాష్ర్ట‌లోని నాగ్‌‌పూర్‌లో చోటు చేసుకుంది. నాగ్‌పూర్‌లోని కొరాడికి చెందిన అశోక్ మ‌న్‌వాటే అనే వ్య‌క్తి ఖాతాలో రూ. 8.95 ల‌క్ష‌లు ఉన్నాయి. అయితే సైబ‌ర్ నేరగాళ్లు.. అత‌ని మొబైల్‌కు ఫోన్ చేసి.. తాము డిజిట‌ల్ పేమెంట్స్ కంపెనీ ప్ర‌తినిధుల‌మ‌ని చెప్పారు. క్రెడిట్ లిమిట్ మ‌రింత పెంచుతున్నామ‌ని, దాని కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని సూచించారు. ఈ స‌మ‌యంలోఅశోక్ ఫోన్‌.. తన ప‌దిహేను సంవ‌త్స‌రాల కుమారుడి వ‌ద్ద ఉండ‌టంతో.. సైబ‌ర్ నేర‌గాళ్లు చెప్పిన‌ట్లు చేశాడు. డిజిట‌ల్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న త‌ర్వాత రిమోట్ సిస్టం ద్వారా అశోక్ ఖాతాలో ఉన్న రూ. 8.95 ల‌క్ష‌ల‌ను చోరీ చేశారు. కాసేప‌టికే రూ. 8.95 ల‌క్ష‌లు డెబిట్ అయిన‌ట్లు అశోక్ ఫోన్‌కు మేసేజ్ వ‌చ్చింది. దీంతో హుటాహుటిన బాధిత వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
3
*తమ గురించి బయట పెట్టాడని జర్నలిస్ట్ ని హత్యచేసిన స్మగ్లర్లు*

తమిళ టీవి ఛానల్ రిపోర్టర్‌ మౌసన్‌ గంజాయ్ స్మగ్లర్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. కాంచీపురంలోని పుండ్రత్తూర్‌లో ఈ ఘటన జరిగింది. మాట్లాడాలి.. ఇంటి నుంచి బయటకు రమ్మని చెప్పి దారుణంగా హత్య చేశారు స్మగ్లరు. ఇటీవల గంజాయ్ స్మగ్లింగ్‌, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూ కబ్జాలపై స్టింగ్ ఆపరేషన్ చేశాడు మౌసన్. దీంతో కక్ష కట్టిన స్మగ్లరు జర్మలిస్ట్‌ను దారుణంగా హత్య చేశారు. అతని శరీరంపై 18 చోట్ల కత్తి పోట్లు ఉన్నాయ్. ప్రస్తుతం ముగ్గురు నిందితులు అదుపులో ఉన్నారు.
4
*కర్నూలు జిల్లా ఆదోని లో అంతరాష్ట్ర IPL క్రికెట్ బెట్టింగ్ రాయుడు ఖురేషీ ముస్తాక్ అహ్మద్ అరెస్టు. భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.*
*అరెస్టు చేయడం లో ప్రతిభ చూపిన ఆదోని 1 టౌన్ CI చంద్రశేఖర్, 2 టౌన్ SI రామాంజనేయులు, కానిస్టేబుల్ సందీప్, కర్నూలు స్పెషల్ టీం కు చెందిన హెడ్ కానిస్టేబుల్స్ రమేష్, ఎలిషా, ఈరన్న లకు రివార్డు ప్రకటించిన కర్నూలు SP*

కర్నూలు జిల్లా ఆదోని లో ఇంతకుముందు IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న కోంత మంది ప్రముఖ బుకీలను అరెస్టు చేసి కోర్టులో హాజరు హజరు పరుచగా విచారణలో భాగంగా వారు ఇచ్చిన సమాచారం మేరకు ప్రముఖ బుకీ ఆయిన ఖురేషీ ముస్తాక్ అహ్మద్ గురించి దర్యాప్తు లో బయట పడడం జరిగింది అని. నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని నానల్ నగర్ లో అరెస్టు చేసి క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన కొన్ని వస్తువులను స్వాధీనం చేయడం జరిగింది అని డిఎస్పీ వినోద్ కుమార్ అన్నారు. అహ్మద్ మటన్ వ్యాపారం చేస్తు అందులో లాభాలు లేవు అని తెలుసుకుని 6 సంవత్సరాల నుండి హైదరాబాద్ లో విలాసవంతమైన ఆపార్టుమెంట్ లో కాపురము ఉంటు తన ఇంటి లో రహస్యంగా సెల్ ఫోన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇతనికి ఆదోని, కర్నూలు, ప్రొద్దుటూరు, కదిరి, చిత్తూరు, హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల వారితో క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన లావాదేవీలు ఉన్నట్లు విచారణలో తేలింది అన్నారు. ఈ IPL 2020 లో సూమరు 20 లక్షల వరకూ లావాదేవీలు జరుపుతున్నట్లు విచారణలో తేలింది అని అన్నారు. బెట్టింగ్ రాయుడు ఖురేషీ ముస్తాక్ అహ్మద్ నుంచి 5,11,050/-నగదు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.
5
*గచ్చిబౌలి కారు ప్రమాదం: ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి ఘటనలో కొత్త ట్విస్ట్*

గచ్చిబౌలి: ప్రియాంక స్నేహితుడు మోడీ పబ్బులో మద్యం బాగా సేవించాడు. పబ్బు నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వెళ్ళినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మద్యం బాగా సేవించి అపస్మారక స్థితిలో యువకుడు కారు నడిపినట్టుగా సమాచారం.
గచ్చిబౌలిలో జరిగిన యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన యువతి తల్లి ప్రమాదానికి కారణమైన యువకుడిపై కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గచ్చిబౌలి ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్ది అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె స్నేహితుడు మోడీకి తీవ్ర గాయాలయ్యాయి. రష్యాలో ఎంబీబీఎస్ చదువుతున్న ప్రియాంక లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఫ్రెండ్స్ దగ్గరికి కలవడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ప్రియాంక తన స్నేహితుడైన మోడీతో బయటికి వెళ్ళింది. వోల్వో కార్లో ఇద్దరు బయలుదేరారు. ఇద్దరూ జూబ్లీహిల్స్‌లోని ఎయిర్ లైఫ్ పబ్‌కి వెళ్లి ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి లాంగ్ డ్రైవ్ కోసం బయలుదేరారు.
గచ్చిబౌలి కారు ప్రమాదం, నిందితుడ
అయితే ప్రియాంక స్నేహితుడు మోడీ పబ్బులో మద్యం బాగా సేవించాడు. పబ్బు నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వెళ్ళినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మద్యం బాగా సేవించి అపస్మారక స్థితిలో యువకుడు కారు నడిపినట్టుగా సమాచారం. మద్యం మత్తులో ప్రియాంక స్నేహితుడు మోడీ అత్యంత వేగంతో నడపడం వల్ల హెచ్‌సీయూ గేట్-2 వద్ద చెట్టును ఢీ కొట్టాడు. ఈ సంఘటనలో ప్రియాంక అక్కడికక్కడే మృతి చెందింది. ప్రియాంక మిత్రుడు మోడీకి తీవ్ర గాయాలయ్యాయి,ప్రియాంక అక్కడికక్కడే మృతి చెందింది. ప్రియాంక మిత్రుడు మోడీకి తీవ్ర గాయాల య్యాయి. ప్రియాంక సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రియాంక మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలైన మోడీ బ్రీత్ అనలైజ్ టెస్టు చేయగా ఆ టెస్టులో 40 శాతం నమోదు అయింది. ఈ ఘటనపై మద్యం మత్తులో కారు నడపడం వల్లనే తన కూతురు మరణించిందని ప్రియాంక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మోడీని అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక స్నేహితుడు మోడీ విశాఖ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు. విశాఖపట్నానికి చెందిన యువకుడు హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రియాంక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసి
రిమాండ్‌కు తరలించారు.
6
*యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించి రూ.లక్షల దోపిడీ.*

ఆన్‌లైన్‌ మోసాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటున్నా సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు ఎంచుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ర్టలో ఓ మోసగాడు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించి మరీ డబ్బును దోచుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆ రాష్ర్టంలోని నాగ్‌పూర్‌ సమీపంలో నివాసం ఉండే అశోక్‌ మన్వతే అనే వ్యక్తి ఫోన్‌కు బుధవారం ఓ సైబర్‌ నేరగాడు ఫోన్‌కాల్‌ చేశాడు. ఆ సమయంలో అతని పదిహేనేళ్ల కుమారుడు వద్ద ఆ సెల్‌ఫోన్‌ ఉంది.
ఆ కాల్‌ను ఎత్తిన బాలుడితో తాను ఓ డిజిటల్‌ పేమెంట్‌ కంపెనీకి చెందిన కస్టమర్‌ కేర్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నట్లు అవతలి వ్యక్తి చెప్పాడు. అశోక్‌ బ్యాంకు ఖాతాలు ఫోన్‌కు లింక్‌ అయి ఉన్నట్లు అతను బాలుడికి వివరించాడు. డిజిటల్‌ పేమెంట్స్‌ సంబంధించి అశోక్‌ తన బ్యాంకు క్రెడిట్‌ పరిమితిని పెంచుకోవాలంటే డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని నమ్మించాడు. ఇది నిజమే అనుకున్న బాలుడు ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. వెంటనే ఆ ఫోన్‌ను తన సాఫ్ట్‌వేర్‌తో యాక్సెస్‌ చేసుకున్న వ్యక్తి అశోక్‌ ఖాతాలోని రూ.9 లక్షల డబ్బును కాజేశాడు. అనంతరం ఈ విషయాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.