దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12,93,412 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 8,503 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.46 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 624 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించినవారి మొత్తం సంఖ్య 4,74,735 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 94,943 క్రియాశీల కేసులున్నాయి. గత 24 గంటల్లో 7,678 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.40 కోట్లకు చేరింది.