జీరో అడ్మిషన్లను నమోదుచేసిన ప్రైవేటు డిగ్రీ కాలేజీల అనుమతులను రద్దు చేయడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపై ఉన్నత విద్యా మండలి అధికారులు కసరత్తు చేస్తూ చివరకు మూసేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఈ ఏడాదిలో సున్నా అడ్మిషన్ల జాబితాలో సుమారు 50 డిగ్రీ కాలేజీలు ఉన్నట్టు గుర్తించారు. మరో 250 ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కేవలం 50లోపే విద్యార్థులు చేరారు. ఇలా సుమారు 300 కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య బాగా పడిపోయింది. వీటికి దోస్త్‌ ద్వారా ప్రవేశాలకు అవకాశం ఇవ్వలేదు. వరుసగా మూడేళ్లపాటు సున్నా అడ్మిషన్లు నమోదైన కాలేజీలను మూసేయాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.