నేటి దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. ఉదయం 9.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 172 పాయింట్ల నష్టంతో 58,635 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 17,473 వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీసీ, సిప్లా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు స్వల్ప లాభాల్లో ప్రయాణిస్తుండగా టాటామెటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.