నేటి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. రోజు మొత్తం తీవ్ర ఒడిదుడుకులకు లోనై చివరకు నష్టాలలో ముగిసాయి. ఉదయం 58,586 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొని చివరికి 20.46 పాయింట్ల నష్టంతో 58,786.67 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 5.50 పాయింట్ల నష్టంతో 17,511.30 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌ లాభాల్లో ముగిసాయి. టైటాన్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, దివీస్‌ ల్యాబ్స్‌, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ నష్టాలు చవిచూశాయి.