బ్రహ్మపుత్ర క్రాకర్‌ అండ్‌ పాలిమర్‌ లిమిటెడ్‌ (బీసీపీఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు : నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 ఖాళీలు ఉన్నాయి. వీటిలో డిప్యూటీ జనరల్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టులు ఉన్నాయి. ఎఫ్‌అండ్‌ఏ, లా, హెచ్‌ఆర్‌, కెమికల్‌, మెకానికల్‌, మార్కెటింగ్‌, ఐటీ, ఎలక్ట్రికల్‌, ఆన్‌స్ట్రూమెంటేషన్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ/ ఎంఎంఎస్‌, బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌, సీఏ/ ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత పొందాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 30 నుంచి 51 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు : ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష/ గ్రూప్‌ డిస్కషన్‌/ ఇంటర్వ్యూ ఆధారం ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24,900 నుంచి రూ. 73,000 వరకు చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 13-12-2021న ప్రారంభమవుతుండగా, చివరి తేదీగా 12-01-2021ని నిర్ణయించారు.