ఇండోర్‌(మధ్యప్రదేశ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) సంయుక్తంగా మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌, డేటా సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌లో రెండేళ్ల కోర్స్ చేయడానికి ప్రవేశ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం సీట్లు 200 ఉన్నాయి. అప్లై చేయాలనుకున్న వారి కనీస అర్హత బీటెక్‌/బీఈ/బీఎస్‌/బీఫార్మా/బీఆర్క్‌/బీడిజైన్‌/నాలుగేళ్ల బీఎస్సీ/ఎమ్మెస్సీ/ఎంసీఏ/ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు క్యాట్‌/గేట్‌/జీమ్యాట్‌/జీఆర్‌ఈ/జామ్‌ వ్యాలిడ్‌ స్కోరు ఉండాలి. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా జనవరి 07 నిర్ణయించారు. పూర్తి వివరాలకై చూడవలసిన వెబ్‌సైట్‌: https://msdsm.iiti.ac.in/