ఇప్పటివరకు విమాన ప్రమాద ఘటనలో ఎందరో ప్రముఖులు అసువులు బాసారు. మొదటగా 1945వ సంవత్సరం ఆగస్టు 18వ తేదీన సుభాష్ చంద్రబోస్ తైవాన్ విమాన ప్రమాదంలో చనిపోయారని చెబుతారు. తరువాత 1973 వ సంవత్సరం మే 31న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయిన మోహన్ కుమార మంగళం విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతదేహాలన్నీ చెదిరిపోగా, ఆయనయొక్క పార్కర్ పెన్ను, ఆయన ధరించిన వినికిడి యంత్రం సాయంతో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. 1980వ సంవత్సరం జూన్ 23న సంజయ్ గాంధీ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఢిల్లీ సప్తదార్ జంగ్ విమానాశ్రయంలో హెలికాప్టర్ టేకప్ అయిన కొద్దిసేపటికే కింద కూలిపోయి మరణించారు. 2001 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి డేరా నాథుండు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇంకా మాధవరావు సింథియాలాంటి జాతీయ స్థాయిలో మంచి గుర్తిపు ఉన్న నేత.. కాంగ్రెస్‌ సీనియర్‌, ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా తండ్రి మాధవరావు సింథియా కూడా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2001 సెప్టెంబర్‌ 30న కాన్పూర్‌లో జరిగిన ఈ ఘటనలో సింథియా సహా ఏడుగురు మరణించారు. 2002వ సంవత్సరం మార్చి 3వ తేదీన లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో భీమవరం నుంచి తిరిగి వస్తుండగా చెరువులో హెలికాప్టర్ కూలిపోయి మరణించారు.

2004 సంవత్సరంలో మేఘాలయ మంత్రి సగ్మా, ఆయనతో పాటుగా ముగ్గురు ఎమ్మెల్యేలు మరణించారు. 2004 వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన ప్రముఖ సినీ నటి సౌందర్య ప్రయాణిస్తున్న విమానం బెంగళూరులోని జక్కురు విమానాశ్రయం పక్కన కుప్ప కూలి అక్కడే సజీవదహనం అయ్యారు. 2005వ సంవత్సరం మార్చి 31 వ తేదీన జిందాల్ స్టీల్స్ అధినేత ఓం ప్రకాశ్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. యూపీ లేని సహరాన్పూర్ లో హెలికాప్టర్ కుప్పకూలింది. 2009వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన ఏపీ రాజశేఖర్ రెడ్డి నల్లమల ఫారెస్ట్ లోని పావురాల గుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న బెల్‌ 430 హెలికాప్టర్‌ నల్లమల అడవుల్లో కుప్పకూలిపోయింది. ఆయనతోపాటు ఇంకా అయిదుగురు కూడా చనిపోయారు. 2011 వ సంవత్సరం అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జిఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రతికూల వాతావరణం కారణంగా లోబో తాండా వద్ద కుప్పకూలింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం ధోర్జీ ఖండూ హెలికాప్టర్‌ ప్రమాదంలో 2011 ఏప్రిల్‌ 30న మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న పవన్‌ హాన్స్‌ బీ8 మోడల్‌ హెలికాప్టర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో నలుగురు మరణించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మృతి చెందారు. 2009 సెప్టెంబర్‌ 2న చిత్తూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళుతుండగా.. ఆయన సహా మొత్తం ఐదుగురు ఆ ప్రమాదంలో మరణించారు. రాజశేఖర్ రెడ్డి మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగానే మిగిలింది. తాజాగా ఇప్పుడు తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం కూడా వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో హెలీకాఫ్టర్ ప్రమాదాలు మరోసారి చర్చలకు తావిచ్చాయి.