హిందూపూర్‌-దేవరపల్లి స్టేషన్ల మధ్య డబుల్‌ లైను నిర్మాణ పనులు జరుగుతుండడంతో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18463/18464) సర్వీసులు ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు భువనేశ్వర్‌-సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్యలో మాత్రమే నడుస్తాయని రైల్వే అధికారులు ప్రకటించారు. సత్యసాయి ప్రశాంతి నిలయం-బెంగళూరు మధ్య రాకపోకలను కూడా మూడు రోజులపాటు తాత్కాలికంగా రద్దు చేసారు.