దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 1,68,063 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 277 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకూ మరణించిన వారి మొత్తం సంఖ్య 4,84,213 కి చేరింది. గత 24 గంటల్లో 69,959 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3.45 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 8,21,446కి చేరింది.

ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. నిన్న 428 మందిలో దీనిని గుర్తించడంతో మొత్తం కేసులు 4,461కి పెరిగాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 1,247 మంది ఈ వేరియంట్ బారినపడగా.. రాజస్థాన్‌, దిల్లీలో ఆ సంఖ్య 645 గా ఉంది.