ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NHPC) ట్రైనీ ఇంజనీర్ విభాగంలో 53 పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ట్రైనీ ఇంజనీర్(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్), ట్రైనీ ఆఫీసర్(ఫైనాస్స్ కంపెనీ సెక్రటరీ) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ట్రైనీ ఇంజనీర్(సివిల్)-29
ట్రైనీ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-4
ట్రైనీ ఇంజనీర్(మెకానికల్)-20
ట్రైనీ ఆఫీసర్(ఫైనాన్స్)-12
ట్రైనీ ఆఫీసర్(కంపెనీ సెక్రటరీ)-2
విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాలను అనుసరించి ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

ట్రైనీ ఆఫీసర్(ఫైనాన్స్) ఉద్యోగానికి సంబంధించి సీఏ పాసై ఉండాలి. ట్రైనీ ఆఫీసర్(కంపెనీ సెక్రటరీ) ఉద్యోగానికి కంపెనీ సెక్రటరీ విద్యార్హత కల్గి ఉండాలి. గేట్ -2021 ఎగ్జామ్ రాసిన వారు మాత్రమే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే గేట్ 2021 లో అభ్యర్థులు సాధించిన స్కోర్ ను ఆధారంగా చేసుకొని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.500000 నుంచి రూ.1,600000 వేతనం చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nhpcindia.com/ వెబ్ సైట్ ను చూడండి.