గీతం విశ్వవిద్యాలయంలో 2022-23 సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించినట్లు విశ్వవిద్యాలయ ప్రొవీసీ ఎన్‌.శివప్రసాద్‌ వెల్లడించారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, బెంగళూరు క్యాంపస్‌లలో ప్రవేశాలకు ప్రవేశపరీక్ష ఉంటుందని, దరఖాస్తులు వర్సిటీ వెబ్‌సైట్‌ http://www.gat.gitam.edu లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఆన్‌లైన్‌ల్‌ స్లాట్‌ బుక్‌ చేసుకుని, ఇంటి వద్ద నుంచే ప్రవేశ పరీక్ష రాయడానికి వీలు కల్పించారు. ప్రవేశాల విభాగం సంచాలకుడు జి.ఉదయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రవేశ పరీక్ష వివరాలకు 9542424256/59, 8880884000 లేదా [email protected] మెయిల్‌లో సంప్రదించవచ్చని అన్నారు.