ప్రపంచ ప్రముఖ ఐటీ కంపెనీ ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫాం లలో iPhone 12 సిరీస్ కొనుగోలు చేసినవారికి స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లలో ఈ భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

iPhone 12, iPhone 12 mini స్మార్ట్‌ఫోన్‌లపై మోడల్ ఆధారంగా దాదాపు రూ. 10,000 వరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రిటైల్ మొబైల్ అవుట్‌లెట్లలో కంటే అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. iPhone 12, iPhone 12 mini 5G (4G LTE) కనెక్టివిటీతో పాటు Apple A14 బయోనిక్ చిప్‌ను అమర్చారు.

Amazon, Flipkartలో iPhone 12 అసలు ధర (రూ. 63,900)పై ఉండగా.. Filpkartలో (64GB స్టోరేజ్ వేరియంట్‌) డిస్కౌంట్ ధర రూ. 53,999కు ఆఫర్ చేస్తోంది. అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ ధర రూ. Amazonలో 63,900 ఉండగా.. రిటైల్ స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ. 65,900గా ఉంది. Apple iPhone 13 series లాంచ్ చేసిన తర్వాత ఆపిల్ ఒక్కసారిగా మొత్తం ధరలను తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 12 (128GB స్టోరేజ్ వేరియంట్) రూ. 64,999 ఉండగా.. అమెజాన్ వెబ్ సైట్లో, రిటైల్ అవుట్‌లెట్‌లలో రూ.70,900 ఒకే ధరతో అందుబాటులో ఉంది.

Amazon, Flipkartలో వీటి ధర ఎంతంటే.. : iPhone 12 mini ఐఫోన్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో (64GB స్టోరేజ్ వేరియంట్) తగ్గింపు ధర రూ. 40,999గా అందుబాటులో ఉంది. ఇదే స్మార్ట్‌ఫోన్ (64GB స్టోరేజ్ వేరియంట్) Amazonలో ధర రూ. 53,900కు అందుబాటులో ఉంది. రిటైల్ ధర రూ. 59,900గా ఉంది. Flipkartలో కూడా iPhone 12 mini (128GB) వెర్షన్‌పై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 54,999గా ఉండగడా.. అమెజాన్ రిటైల్ అవుట్‌లెట్‌లలో ప్రస్తుతం ధర రూ.64,900కు అందుబాటులో ఉంది.

iPhone 12, iPhone 12 mini ఫీచర్లు ఏంటంటే : iPhone 12, iPhone 12mini రెండు మోడళ్లలో Dual SIM డ్యూయల్-సిమ్ (Nano + eSIM) Apple A14 బయోనిక్ చిప్ స్పోర్ట్ సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేలతో యూజర్లను మరింత అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. Apple సిరామిక్ షీల్డ్ గ్లాస్ మరింత ప్రొటెక్ట్ ఇస్తుంది. ఐఫోన్ 12 6.1- అంగుళాల స్క్రీన్‌తో వచ్చింది. iPhone 12mini మోడల్ 5.4-అంగుళాల చిన్న డిస్‌ప్లేతో వచ్చింది. iPhone 12 , iPhone 12 mini రెండూ బాక్స్‌ల్లో ఛార్జర్‌ లేదు.. Apple వైర్‌లెస్ ఛార్జర్ MagSafe ఛార్జింగ్‌కు ఈ రెండు ఫోన్లు సపోర్ట్ చేస్తాయి.

స్మార్ట్‌ఫోన్‌లు 2020లో iOS 14తో లాంచ్ అయ్యాయి. 2021లో iOS 15కి అప్ డేట్ చేసింది ఆపిల్. iPhone 12, iPhone 12 mini ఫీచర్ 5G కనెక్టివిటీ, 4G LTE కనెక్టివిటీకి అప్‌గ్రేడ్ చేసింది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ 12-MP డ్యూయల్ రియర్ కెమెరాలతో వచ్చాయి. వైడ్ యాంగిల్ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. వరుసగా f/1.6 ఎపర్చరు, f/2.4 ఎపర్చర్‌తో వచ్చాయి.