దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు లాభాలతోనే ముగిసాయి. ఉదయం సెన్సెక్స్‌ 60,342.70 పాయింట్ల వద్ద స్తబ్ధుగా ప్రారంభమై తరువాత ఊగిసలాట ధోరణిలో కదలాడి అక్కడ కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకున్న సూచీలకు గరిష్ఠాల వద్ద నిరోధం ఎదురైంది. దీంతో ఇంట్రాడేలో ఈ సూచీ 60,689.25-60,281.52 మధ్య కదలాడి చివరకు 221.26 పాయింట్ల లాభంతో 60,616.89 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 17,997.75 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమై రోజులో 18,081.25 – 17,964.40 మధ్య కదలాడి చివరకు 52.45 పాయింట్లు లాభపడి 18,055.75 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్స్, టెక్ మహీంద్రా, హెచ్ డి ఎఫ్ సి, ఓఎన్ జిసి, హెచ్ సి ఎల్ టెక్ షేర్లు లాభాలబాట పట్టాయి. బి పి సి ఎల్, హిందాల్కో, జె ఎస్ డబల్యూ స్టీల్, కోల్ ఇండియా, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ముగిసాయి.