దేశీయ స్టాక్ మార్కెట్‌ నేడు స్వల్ప లాభాలతో మొదలై ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 107 పాయింట్ల లాభంతో 60,502 వద్ద ట్రేడవుతుండగా .. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 18,030 వద్ద ట్రేడవుతున్నాయి.

నిఫ్టీ 50 సూచీలో గ్రాసిమ్‌, టాటా కన్జ్యూమర్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఎన్‌టీపీసీ, శ్రీరాం సిమెంట్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బజాజ్‌ ఫినాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.