పోలీస్ ఫుట్ పెట్రోలింగ్.
ఖాకి వలయంలో మండలం.
నేటి నుండి 144 సెక్షన్ అమలు.
సిఐ కె.మంగాదేవి, ఎస్ ఐ ఎస్ .శివప్రసాద్
కోస్తా ఎన్ కౌంటర్, ఆలమూరు.
మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆలమూరు మండలంలోని అన్ని గ్రామాలకు 144 సెక్షన్ అమలుపరిచనునట్లు మండపేట రూరల్ సిఐ కె.మంగాదేవి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎస్ ఐ ఎస్ .శివ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో చింతలూరు గ్రామం నుండి కొత్తూరు సెంటర్ వరకు పోలీస్ ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీ ఐ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలన్నారు.ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవలన్నారు. గ్రూప్ రాజకీయాలు చేయడం, డబ్బులు ,మద్యం పంచడం చేయకూడదని అట్టి ఆంక్షలు ఎవరైనా అధిగమించినట్లయితే చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.