ఈ రోజు రాత్రి 7:30కు రెండో విడత ప్రచారానికి తెర పడనుంది. రెండో విడతలో 3,328 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. రెండో విడతలో 2,789 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పోటీదారులు 7,510 మంది ఉన్నారు. మొత్తం 33,570 వార్డు స్థానాలకు ఎన్నికలు, అందులో 12,605 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 20,965 వార్డు స్థానాలకు 44,879 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 13న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు