రాజకీయం (Politics)

ష‌ర్మిల పార్టీ ప్ర‌క‌ట‌న‌కు డేట్ ఫిక్స్‌..!

తెలంగాణ‌లో వైఎస్ ష‌ర్మిల పార్టీ ప్ర‌క‌ట‌న‌కు తేదీ ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. పార్టీ ప్ర‌క‌ట‌న‌కు ముహూర్తాల కంటే సెంటిమెంట్‌ల‌నే ష‌ర్మిల ఫాలో అవుతున్నారు. ఏప్రిల్ 10వ తేదీన ఆమె పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు. స‌రిగ్గా 18 సంవ‌త్స‌రాల క్రితం ఏప్రిల్ 10వ తేదీనే దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్. రాజ‌శేఖర్ రెడ్డి పాద‌యాత్ర ప్రారంభించారు. ఇదే రోజున త‌న పార్టీని ప్ర‌క‌టించాల‌ని ష‌ర్మిల నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

త‌న తండ్రి వైఎస్‌కు చేవెళ్ల సెంటిమెంట్ ఎక్కువ‌గా ఉండేది. తాను ఏ కార్య‌క్ర‌మం ప్రారంభించినా చేవెళ్ల నుంచే ప్రారంభించే వారు. ష‌ర్మిల కూడా తండ్రి బాట‌లోనే ఏప్రిల్ 10న చేవెళ్ల‌లో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి పార్టీని ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అదే రోజు ఆమె పార్టీ పేరు ప్ర‌క‌టించ‌డంతో పాటు జెండా ఆవిష్క‌రించ‌నున్నారు.

ఇప్ప‌టికే ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానుల‌తో ష‌ర్మిల స‌మావేశ‌మ‌య్యారు. ఏప్రిల్ మొద‌టి వారంలోగా రాష్ట్రంలోని మిగ‌తా అన్ని జిల్లాల సమావేశాలు పూర్తి చేయాల‌ని ఆమె నిర్ణ‌యించారు. ఈ నెల 21న ఖ‌మ్మం జిల్లా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఖ‌మ్మం జిల్లాలో వైఎస్‌కు అభిమానులు ఎక్కువ కాబ‌ట్టి చాలామంది స‌మావేశానికి హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. అంత‌మందిని హైద‌రాబాద్ పిలిపించ‌డం కంటే తానే ఖ‌మ్మం వెళ్లాల‌ని ష‌ర్మిల నిర్ణయించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.