రాజకీయం (Politics)

టీఆర్ఎస్‌కు ఎంఐఎం మ‌ద్ద‌తు… మేయ‌ర్‌గా ఎన్నికైన గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ

గ్రేటర్ హైద‌రాబాద్ మేయ‌ర్‌గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ ఎన్నిక‌య్యారు. ఎంఐఎం పార్టీ స‌భ్యులు కూడా టీఆర్ఎస్ అభ్యర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఆమె సులువుగా విజ‌యం సాధించారు. మేయ‌ర్ ప‌ద‌వికి బీజేపీ నుంచి రాధా ధీర‌జ్ రెడ్డి కూడా పోటీ చేయ‌గా బీజేపీ కార్పొరేట‌ర్లు ఆమెకు మ‌ద్ద‌తు ఇచ్చారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్ద‌రు కార్పొరేట‌ర్లు ఎన్నిక‌ను బ‌హిష్క‌రించారు.

ఇక‌, డిప్యూటీ మేయ‌ర్ ప‌దవికి టీఆర్ఎస్ త‌ర‌పున మోతె శ్రీల‌త‌, బీజేపీ త‌ర‌పున శంక‌ర్ యాద‌వ్ పోటీ చేశారు. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌లోనే ఎంఐఎం స‌భ్యులు టీఆర్ఎస్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో మోతె శ్రీల‌త డిప్యూటీ మేయ‌ర్‌గా విజ‌యం సాధించారు. కాగా, ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో స‌భ‌లో బీజేపీ స‌భ్యులు పెద్ద ఎత్తున జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.