ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలు నిర్వహించగా దానిలో తెలంగాణ యువతి మానస వారణాసి మిస్ ఇండియా 2020 కిరీటాన్ని గెలుచుకున్నారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్ మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు.హర్యానాకు చెందిన మనికా షియోకంద్ మిస్ గ్రాండ్ ఇండియా 2020గా ఎంపిక అయ్యారు.
రాజస్థాన్‌కు చెందిన మిస్ ఇండియా-2019 సుమన్ రతన్ సింగ్ బుధవారం రాత్రి జరిగిన వేడుకలో మానస వారణాసికి మిస్ ఇండియా కిరీటం అలంకరించారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వీరికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు అందచేశారు
హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసికి 23 ఏళ్లు. ఆమె ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్టుగా పనిచేస్తున్నారు.
‘వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020’ కిరీటం గెలుచుకున్న మానస, 2021 డిసెంబర్లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.