నంద‌మూరి హీరోలు బాల‌య్య, జూనియ‌ర్ ఎన్టీఆర్ అప్‌క‌మింగ్ మూవీస్‌పై ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసే అప్‌డేట్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ముందుగా బాల‌య్య విష‌యానికి వ‌స్తే… క్రాక్ సినిమాతో సూప‌ర్ హిట్ అందించిన డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమా తీయనున్నారు. గోపీచంద్ ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌ను ఫైన‌ల్ చేసే ప‌నిలో ఉన్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఈ సినిమా నిర్మించ‌నున్నారు.

ఇక, జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస‌గా టాప్ డైరెక్ట‌ర్ల‌తో వ‌రుస‌గా సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఇప్ప‌టికే రాజ‌మౌళితో ఆర్ఆర్ఆర్ తీస్తున్న తార‌క్ నెక్ట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాకు ఒప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా తీస్తున్నారు. చాలా రోజులుగా ఈ ప్రచారం జ‌రుగుతున్నా ఇప్పటి వ‌ర‌కు క్లారిటీ రాలేదు.

కేజీఎఫ్‌తో సూప‌ర్ హిట్ అందుకొని మొత్తం ఇండియ‌న్ సినీ ప‌రిశ్ర‌మ‌నే త‌న వైపు తిప్పుకున్న ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడు కేజీఎఫ్ – 2 తెర‌కెక్కించాడు. ప్ర‌భాస్‌తో చేస్తున్న స‌లార్ సినిమాకు షూటింగ్ మొద‌లైంది. ఈ సినిమా త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా తీయ‌నున్నాడు. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేక‌ర్స్ వారే తెర‌కెక్కించ‌నున్నారు.