అంతర్జాతీయం (International)

పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి తమ బలగాల ఉపసంహరణకు అంగీకరించిన చైనా

లదాఖ్ సరిహద్దులో పరిస్థితి గురించి రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశానికికి సంబందించిన భూమి ఒక్క అంగుళం కూడా భారత్ వదులుకోదని అన్నారు.

భారత్, చైనా దేశాలు పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవాలనే ఒప్పందానికి వచ్చాయని రాజ్‌నాథ్ తెలిపారు.దీనికి సంబంధించి చైనా బుధవారం ప్రకటన చేసింది.

చైనాతో చర్చల్లో భారత్ ఏమీ కోల్పోలేదని మంత్రి స్పష్టం చేశారు.

“అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ భారత బలగాలు ధైర్యసాహసాలు ప్రదర్శించాయని ధైర్యంగా నిలబడిన సైనికులందరిని అభినందించవలసిందిగా సభను కోరుతున్నాను” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

సరిహద్దు సమస్యల పరిష్కారం దిశగా చైనాతో వివిధ స్థాయిలలో చర్చలు జరుగుతున్నాయని, ఆయన చెప్పారు. మిగతా అన్ని సమస్యల విషయంలో కూడా చర్చలతో ముందుకెళ్లాలని అనుకుంటున్నామని, అందుకు చైనా సహకరిస్తుందని భావిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.