టాప్ స్టోరీస్ (Top Stories)

సముద్ర జలాలలో దాగిన ఎనిమిదవ ఖండం

భూమిపై ఉన్న మొత్తం భూభాగం ఏడు ఖండాలతో వివిధ పరిమాణాలలో ఏర్పడిందని మనం ఇప్పటి వరకు చదువుకున్నాము.కొన్ని ఖండములు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండగా, మరికొన్ని విడిగా కూడా ఉన్నాయి. అన్ని ఖండాలకు అన్ని దేశాలు ఉన్నాయి.

మనకి ఇప్పటికి వరకు తెలిసిన ఏడు ఖండాల పేర్లు: ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా కాగా శాస్త్రవేత్తలు అతి పురాతనమైన ఎనిమిదవ ఖండాన్ని ఇటీవల కనుగొన్నారు.

ఈ భూగ్రహం మీద 71 శాతం నీరు, 29 శాతం భూమి ఆక్రమించుకుని ఉన్నాయి. నిజానికి, బిలియన్ల సంవత్సరాల క్రితం, ప్రపంచంలోని ఏడు ఖండాలు పంగేయా అని పిలువబడే ఒకే భారీ భూభాగంగా కలిసి ఉండేవి కానీ ప్లేట్ టెక్టోనిక్స్కు క్రమంగా విడిపోయి వేరయ్యాయి.


ఇక అసలు విషయానికి వస్తే జీలాండియా అనేది ఎనిమిదవ ఖండం.ఈ ఖండం 375 సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయింది.ఆ ఖండం మనకి అతి చేరువలో ఉన్న కూడా దాని మనుగడ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలకు ౩౭౫ సంవత్సరాలు పట్టింది.
అయినప్పటికీ ఇప్పటికి దానికి సంబందించిన విషయాలు మొత్తం వెలుగు చూడలేదని చెప్పాలి.
అబెల్ టాస్మాన్ అనే అనుభవజ్ఞుడైన డచ్ నావికుడు 1642 సంవత్సరంలో ఇలాంటి ఒక ఖండం ఉందని బలంగా నమ్మి దానిని వెతుకుతూ బయల్దేరాడు.16 వ శతాబ్ద కాలానికి ముందు దక్షిణ భాగం లో కూడా ఒక భూభాగం ఉండవచ్చని యూరోపియాన్స్ ఎవరు నమ్మేవారు కాదు.కానీ తస్మాన్ మాత్రం చాల బలంగా నమ్మి ఎలా అయినా దానిని కనిపెట్టాలని సంకల్పించాడు.


ఈ నావిదుకు 1642 ఆగష్టు 14 న ఇండోనేషియాలోని జకార్తా నుండి రెండు చిన్న ఓడలలో బయల్దేరి మొదట పశ్చిమ దిశగా పయనించి తరువాత దక్షిణానికి, అటు నుండి తూర్పువైపు కు పయనించాడు.చివరకు న్యూజీలాండ్ లో ఉన్న సౌత్ ఐలాండ్ కు చేరుకోగా ఆదివాసీలు ిన మావోరీ ప్రజలతో అతని మొదటి అనుభవం బెడిసి కొట్టింది.తరువాత కొంతమంది నావికులు ఒక చిన్న పడవ మీద బయల్దేరి మరొక చిన్న పడవను ఢీ కొట్టగా నలుగురు యూరోపియన్ లు చనిపోయారు.వారి జడ కూడా ఎవరికీ తెలియలేదు.దానితో తస్మాన్ ప్రయాణ, అక్కడితో ముగిసింది.
కొన్ని వారాల తర్వాత ఇంక ఆ భూమి మీద అడుగు పెట్టకుండానే వెనుతిరిగి ఆ ప్రదేశానికి హంతకుల బే (మురుడేనర్స్ బే)అని పేరు పెట్టాడు.ఆ తరువాత అటువైపు మరల ప్రయాణం చేయలేదు.ఆరోజులలో ఆస్ట్రేలియా గురించి తెలుసు కానీ దక్షిణార్థ గోళం లో తలు వెతుకుతున్న పురాతన భారీ భూఖండం అని ఆయన ఆ మాత్రమూ ఊహించలేదు.


ఆ భారీ భూఖండం ఉన్నట్టుగా జియాలజిస్ట్ లు ప్రకటించేసారు అది పతాక శీర్షికలకు కూడా ఎక్కింది.ఆ భూఖండం సుమారుగా 18.9 లక్షల చదరపు మైళ్ళు (49 లక్షల చదరపు కిలో మీటర్) విస్తరించి ఉంది. అది ఎంత పెద్దగా ఉందంటే మడగాస్కర్ కంటే ఆరు రెట్లు పెద్దదిగా ఉంది.ఈ విషయానిని అంగీకరించడానికి మ్యాప్ లు ,సెర్చ్ ఇంజిన్ లు, ఎన్సైక్లోపీడియా లు కొంతకాలం అంగీకరించనప్పటికీ తరువాత రుజువులు చూసి అంగీకరించక తప్పలేదు.
ఇది ప్రపంచం లోని అతి చిన్న ఖండం,అతి సన్నని ఖండం మరియు అతి చిన్న వయసు కలిగిన ఖండం.ఎందుకనగా ఈ ఖండం లో 94 శాతం ప్రాంతం సముద్ర జలాలలో దాగి ఉంది.న్యూజీలాండ్ లాంటి కొన్ని ద్వీపాలు మాత్రం నీటిపైకి చొచ్చుకుని వచ్చాయి.అంటే ఇన్నాళ్ళుగా మన కాళ్ళ ముందే ఈ ఖండం దాగి ఉందన్నమాట!కొన్ని సార్లు మన కాళ్ళ ముందు ఉన్నదానిని కూడా మనం చూడలేము అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు.
నిజానికి ఇది ప్రారంభం ఎందుకంటే ఈ ఖండం చరిత్ర వెలుగులోకి వచ్చి ౪ సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంక దీనికి సంబందించిన చాల రహస్యాలు నీటికి 6,560 అడుగుల లోతులో దాగి ఉన్నాయి.ఈ ఖండం మీద జీవించే జీవ రాశులు అసలు ఎలా నివసించేవి అసలు ఇది ఇలా ఏర్పడడానికి గల కారణం ఏంటి?ఇది ఎంతకాలంగా నీటిలో మునిగి ఉంది అనే ప్రశ్నలకు సమాధానం వెతకడం అనేది చాల కష్టసాధ్యమైన పని.
1642 లో టాస్మాన్ న్యూజీలాండ్ ను కనుగొన్న చాలాకాలం తరువాత జేమ్స్ కుక్ అనే బ్రిటన్ దేశ మ్యాప్ రూపకర్తను శాస్త్రీయ పరిశోధన కోసం, భూమికి, సూర్యుడుకి మధ్య శుక్రుడు ప్రయాణించేదానిని అధ్యయనం చేయాలనీ అధికారికంగా నిర్దేశించారు.ఆయనకీ ఒక షీల్డ్ కవర్ కూడా అతనికిచ్చి ఆయనకీ నిర్దేశించిన పని వూర్తి అయిన తర్వాత తెరిచి చూడవలసిందిగా ఆదేశించారు.దానిలో దక్షిణార్థ గోళంలో ఉన్న భూఖండాన్ని కనిపెట్టే రహస్య కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించారు.అంటే ఆయన అంతకు మునుపు కూడా ఆ ఖండం మీద ప్రయాణించారనేది స్పష్టం గా మనకి తెలుస్తుంది.
నిజానికి 1895 లో న్యూజీలాండ్ దక్షిణతీరంలోని ద్వీపాలశ్రేణిని సర్వే చేసి సముద్రయానం చేయడానికి స్కాటిష్ ప్రకృతి శాస్త్రవేత్త సర్ జేమ్స్ హెక్టర్ జీలాండియా ఉనికి గురించి మొట్టమొదటి నిజమైన ఆధారాలను సేకరించారు.న్యూజీలాండ్ అనేది “దక్షిణాదికి తూర్పుకు దూరంగా విస్తరించి ఉన్న ఒక భారీ ఖండానికి చెందిన ఒక పర్వత శ్రేణి అవశేషం మరియు అది ఇప్పుడు నీటిలో మునిగి ఉంది అని నిర్ధారించారు.ఈ విషయాన్ని సం|| 1960 కంటే ముందుగానే కనుగొన్నప్పటికీ వేరే కారణాల రీత్యా జీలాండియా గురించి తెలుసుకోగలిగిన అవకాశం మరుగున పడిపోయిందని సం|| 2017 లో అధ్యయనానికి నాయకత్వం వహించిన నిక్ మార్టిమెర్ చెప్పారు.


ఖండానికి నిర్వచనాన్ని సం|| 1960 లో శాస్త్రవేత్తలు విస్తృతార్థం లో సముద్రమట్టానికి అధికమైన ఎత్తులో అనేక రాళ్లతో మందపాటి ఉపరితలం గల ప్రాంతంగా నిర్వచించారు.ఇంక అది వైశాల్యం లో కూడా ఏంటో పెద్దదిగా ఉండాలి కానీ ఒక చిన్న తునకగా కాదు అని మార్టిమెర్ అంటారు.ఓకే ఖండానికి కనిపెట్టడం అన్నది చాల వ్యయప్రయాసలతో కూడిన పని మరియు చాల అత్యవసరమైన పరిశోధన కూడా!అమెరికన్ జియోఫిజిసిస్ట్ బ్రూస్ కూడా దీనిని ఒక ఖండంగా అభివర్ణించారు.దీనికి జీలాండియాఅని పేరును కూడా ఆయనే సూచించారు.

సముద్ర భూభాగం ఉపరితలం సుమారు 10 కిలోమీటర్ల మందం వరకూ ఉంటే.. ఖండాల భూభాగం ఉపరితలం సాధారణంగా 40 కిలోమీటర్ల మందం వరకూ ఉంటుంది. జీలాండియా చాలా ఒత్తిడికి గురై.. చాలా ఎక్కువగా సాగదీతకు లోనైంది. దీంతో దాని ఉపరితలం మందం కేవలం 20 కిలోమీటర్లకు తగ్గిపోయింది. సన్నని పొరలా సాగిన ఈ ఖండం చివరికి సముద్రంలో మునిగిపోయింది.

జీలాండియా సన్నగా ఉన్నా, నీటిలో మునిగిపోయి ఉన్నా.. ఇందులో కనిపించే రాళ్లను బట్టి అది ఒక ఖండమని జియాలజిస్టులు తెలుసుకున్నారు. భూఖండపు ఉపరితలం.. గ్రానైట్, సున్నపురాయి, అభ్రకము వంటి అగ్నిశిలలు, రూపాంతరితశిలలు, అవక్షేపణ శిలలతో తయారవుతుంది. అదే సముద్రపు అడుగుభాగమైతే సాధారణంగా బసాల్ట్ (నల్లపింగాణి) వంటి అగ్నిశిలలతో తయారవుతుంది.

కానీ ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎనిమిదో ఖండపు అసాధారణ మూలాలు.. భూవిజ్ఞాన శాస్త్రవేత్తల్లో కాస్త ఆశ్చర్యాన్ని, ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఉదాహరణకు.. జీలాండియా చాలా సన్నగా ఉన్నాకూడా చిన్నచిన్న సూక్ష్మ ఖండాలుగా విచ్ఛిన్నం కాకుండా ఎలా కలిసివుందో ఇప్పటికీ అంతుచిక్కలేదు.

అసలు జీలాండియా నీటిలో ఎప్పుడు మునిగింది? ఎప్పుడైనా దీంట్లో పొడి భూమి ఉందా? అనేవీ రహస్యాలుగానే ఉన్నాయి. ప్రస్తుతం సముద్ర మట్టానికి పైన ఉన్న భాగాలు.. పసిఫిక్, ఆస్ట్రేలియా టెక్టానిక్ ప్లేట్లు ఒకదానినొకటి ఢీకొట్టినప్పుడు ఏర్పడిన పర్వతశ్రేణులు. ఇందులోని కొన్ని చిన్న దీవులు మినహా మిగతా ప్రాంతమంతా ఎల్లప్పుడూ నీటిలో మునిగే ఉందా, లేదంటే ఒకప్పుడు పూర్తిగా పొడి భూమిగా ఉందా అనే అంశంపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తుల్లోచ్ చెప్పారు.

ఒకప్పుడు పూర్తిగా పొడి భూమిగా ఉంటే.. అక్కడ ఏ ప్రాణులు నివసించాయి అనే ప్రశ్న కూడా తలెత్తుంది.తేలికపాటి వాతావరణంతో 3.9 లక్షల చదరపు మైళ్ల (10.1 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణంలో ఉన్న గోండ్వానాలో విస్తారమైన వృక్ష, జంతుజాలాలు నివసించేవి. వీటిలో.. భూమిమీది మొట్టమొదటి నాలుగు-అవయవాల జంతువు, ఆ తరువాతి కాలంలో.. భూమి మీద నివసించిన జంతువుల్లోకెల్లా అతిపెద్దదైన టైటానోసారస్ కూడా ఉన్నాయి. మరైతే.. జీలాండియా శిలలలో ఒకప్పుడు నివశించిన జీవుల అవశేషాలు కనిపిస్తాయా?
డైనోసార్లు…


దక్షిణార్ధగోళంలో ప్రాచీన జంతువుల శిలాజాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ 1990 లలో న్యూజీలాండ్‌లో అనేక అవశేషాలు బయటపడ్డాయి. వీటిలో పొడవాటి తోక, పొడవాటి మెడ గల ఒక పెద్ద డైనోసార్ (సారోపాడ్) పక్కటెముక, పొడవాటి ముక్కు గల శాకాహార డైనోసార్ ( హిప్సిలోఫోడాంట్), దృఢమైన చర్మం గల మరొక డైనోసార్ (యాంకైలోసార్) ఉన్నాయి. మళ్లీ 2006లో సౌత్ ఐలాండ్‌కు తూర్పున 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాతం ఐలాండ్లలో ఒక పెద్ద మాంసాహార డైనోసార్ – బహుశా ఒక రకమైన అలోసార్ కావచ్చు – పాదం ఎముక దొరికింది. కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ శిలాజాల కాలాన్ని పరిశీలించినపుడు.. అవన్నీ గోండ్వానా నుండి జీలాండియా ఖండం విడిపోయిన తర్వాతి కాలానివేనని తేలింది.

అయితే జీలాండియా అంతటా డైనోసార్‌లు సంచరిస్తూ ఉండేవని దీని అర్థం కాదు. మిగతా ప్రాంతమంతా ఇప్పటిలా నీటిలో మునిగిపోతే.. మిగిలిన దీవులు డైనోసార్లకు అభయారణ్యాలుగా ఉపయోగపడి ఉండొచ్చు.

ఇక న్యూజీలాండ్‌లో అతి చిత్రమైన, అత్యంత ప్రియమైన జీవుల్లో ఒకటైన కివీ పక్షి విషయాన్ని చూసినపుడు చాలా వింతగా అనిపిస్తుంది. విచిత్రమేమిటంటే.. 800 ఏళ్ల కిందటి వరకూ మడగాస్కర్ అడవుల్లో సంచరించిన ఒక భారీ ఏనుగు పక్షిని న్యూజీలాండ్‌లో మాత్రమే కనిపించే కివి పక్షికి అత్యంత దగ్గరి బంధువుగా పరిశోధకులు గుర్తించారు.దీంతో ఈ రెండు పక్షులు.. గోండ్వానాలో నివసించిన ఒకే మూల పక్షి నుంచి ఉద్భవించాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గోండ్వానా పూర్తిస్థాయిలో ముక్కలుగా విడిపడటానికి 13 కోట్ల సంవత్సరాలు పట్టింది. కానీ అలా విడిపోయినపుడు.. దాని శకలాలు భూగోళమంతటా వ్యాపించాయి. ఆ శకలాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, అరేబియా ద్వీపకల్పం, భారత ఉపఖండం, జీలాండియాలుగా ఏర్పడ్డాయి.

ఈ విషయం.. ఇప్పుడు మునిగిపోయివున్న జీలాండియాలో కొంత భాగం ఆ 13 కోట్ల సంవత్సరాల పాటు సముద్ర మట్టానికి పైనే ఉందని సూచిస్తుంది. అయితే.. సుమారు 2.5 కోట్ల సంవత్సరాల కిందట ఈ ఖండం మొత్తం – బహుశా న్యూజీలాండ్ మొత్తం కూడా – నీటి అడుగున మునిగిపోయినట్లు భావిస్తున్నారు. “ఆ తర్వాతే దీనిమీద మొక్కలు, జంతువులు ఆక్రమించి ఉంటాయని భావిస్తున్నారు” అని సదర్లాండ్ చెప్పారు.

సముద్రంలో ఉన్న జీలాండియా ఉపరితలం నుండి నేరుగా శిలాజాలను సేకరించడం సాధ్యం కాదు. అయితే.. శాస్త్రవేత్తలు డ్రిల్లింగ్ ద్వారా పైపులు పంపిస్తున్నారు. “నిజానికి పెద్ద లోతులేని సముద్రాలలో ఏర్పడే శిలాజాలు విలక్షణంగా ఉంటాయి. చాలా ఉపయోగపడతాయి” అని సదర్లాండ్ పేర్కొన్నారు. “ఎందుకంటే.. అవి చరిత్రను నమోదు చేస్తాయి. చాలా విలక్షణమైన చిన్న, చిన్న, సూక్ష్మ శిలాజాలు కోటానుకోట్లుగా ఉన్నాయి” అని తెలిపారు.

2017లో ఒక బృందం ఈ ప్రాంతాన్ని సర్వే చేయటానికి అత్యంత విస్తృత కార్యక్రమం చేపట్టింది. ఆరు వేర్వేరు ప్రదేశాలలో సముద్ర గర్భంలో 4,101 అడుగుల (1,250 మీటర్లు) కంటే ఎక్కువ డ్రిల్లింగ్ చేసింది. వారు సేకరించిన అంతర్భాగాల్లో.. భూమి మీద మొక్కల పుప్పొడితో పాటు.. వెచ్చని, లోతులేని సముద్ర జలాల్లో నివసించే జీవుల చిప్పలు ఉన్నాయి. దీనినిబట్టి జీలాండియా అంతకుముందు అనుకున్నట్లుగా పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉండగల అవకాశం లేదని తెలుస్తోంది

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.