వార్తలు (News)

ఏపీ నుండి రద్దైన రైలు వివరాలు

విశాఖ-ముంబై మధ్య నడిచే రైలు సోలాపూర్ డివిజన్‌లోని భలవాణి – భిగ్వాన్ మధ్య ఉన్న సింగిల్ లైన్ రైల్వే ట్రాక్‌ డబ్లింగ్ పనులు జరుగుతున్న కారణంగా భద్రతను దృష్టిలో ఉంచుకొని ముంబై-విశాఖ నగరాల మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేశారు. ఈ విషయాన్ని వాల్తేరు డివిజన్‌లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్‌గా పని చేసే ఏకే త్రిపాఠి వెల్లడించారు.

ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ సూచించింది. రైలు నెంబర్ల వివరాలు – విశాఖ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ వెళ్లే స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ (08519)ను మార్చి 12-30 తేదీల ముంబై నుంచి విశాఖ వచ్చే 08520 ప్రత్యేక రైలు సైతం మార్చి 14-ఏప్రిల్ 1 తేదీల మధ్య నడవదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.