హైద‌రాబాద్‌లో జగ్‌నేకీ రాత్‌ నేపథ్యంలో ఫ్లైఓవర్లను గురువారం రాత్రి 10 గంట‌ల నుంచి శుక్రవారం తెల్ల‌వారుజాము వ‌ర‌కు అవాంఛనీయ ఘటనలు జ‌ర‌గ‌కుండా మూసివేయాలని ‌పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు గ్రీన్‌ల్యాండ్స్, లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్లు, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే మినహా హైద‌రాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లను గురువారం రాత్రి మూసివేయనున్నారు.