దేశంలో కరోనా కేసుల్లో కొద్ది రోజులుగా పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఇప్పుడు గడచిన 24 గంటల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగి, రోజువారీ కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరింది. బుధవారం 7,78,416 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 22,854 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 126 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,85,561కి చేరగా 1,58,189 మంది ప్రాణాలు వదిలారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కొత్త కేసులు ఎక్కువవుతుండటంతో ఆక్టివ్ కేసుల్లో కూడా పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం 1,89,226 ఆక్టివ్ కేసులుండగా ఆ రేటు 1.68 శాతానికి చేరింది. అయితే వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కొంచం పెరిగింది. తాజాగా 18,100 మంది కొవిడ్ నుంచి కోలుకుంటే రికవరీ రేటు 96.92 శాతానికి చేరింది.

మన దేశంలో కరోనా టీకా కార్యక్రమం నిరాంటకంగా కొనసాగుతోంది. రెండు దశలతో కలిపి మార్చి 10 నాటికి కేంద్రం 2,56,85,011 మందికి టీకా డోసులను పంపిణీ చేసింది. నిన్న ఒక్కరోజే 13,17,357 మంది టీకా వేయించుకున్నారు.