భారత దేశం అంటేనే అన్ని మతాలకు నిలయం. సర్వ మత సమ్మేళనం. ఎన్ని మతాలు ఉన్నా వారి మతాలను కాపాడుకోవడానికి కొంతమంది పెద్దలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అలాగే భారత్‌లో తమ మతం అంతరించకుండా ఉండటానికి పార్సీలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. పారసీ మతానికి మరొక పేరు కూడా ఉంది అది జొరాస్ట్రియనిజం. దేశంలో ఇప్పుడు పార్సీల సంఖ్య 60 వేలకంటే తక్కువే ఉంది. ముందు ముందు ఈ సంఖ్య మరింత తక్కువైపోవచ్చని భావిస్తున్నారు.


దానితో ఇది ఎక్కడ అంతరించిపోతుందోనని దీనిని ఎదుర్కోవడానికి పారసీఈలు పెళ్లి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వీరు పెళ్లిళ్లు చేసుకుని తమ సంతతిని పెంచడం ద్వారా వారి మతాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.