టైకి కెమికల్ ఇండస్ట్రీస్‌లో ఎయిర్ గ్యాస్ లీక్ అయిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ సర్పవరంలో చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ కావడంతో సమీపంలోని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ ఘటనలో బిల్డింగ్‌ చుట్టూ పక్కన ఉన్న గోడ కూలి రోడ్డుపై చెల్లాచెదురవడంతో ఇద్దరు మృతి చెందారు. మరొక ఆరుగురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వారికి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయినవారు సుబ్రమణ్యం, వెంకటరమణగా గుర్తించారు.