కరోనా విజృంభణతో మహారాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతోంది.మహారాష్ట్రకు చెందిన నాగ్‌పూర్‌ జిల్లాలో ఏడురోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో మరోసారి కరోనా మహమ్మారి విజృంబించడంతో దాని కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలవైపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి ఎదురయింది. ‘మార్చి 15 నుంచి 21 వరకు నాగ్‌పూర్ సిటీ పోలీస్‌ కమిషనరేట్ ప్రాంతం పూర్తిస్థాయి లాక్‌డౌన్ పరిధిలోకి వెళ్లనుంది’ అని మంత్రి నితిన్ రౌత్ వెల్లడించారు.

కరోనాను కట్టడిచేసేందుకు మహా రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏడు పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వాటిని పాటిస్తుంది. అవి వేగవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్, హాట్‌ స్పాట్స్‌లో మాస్‌ టెస్టింగ్, వైరస్ సోకినవారి సన్నిహితులను పరీక్షించడం.

కొద్ది రోజులుగా 10వేలకు పైగా నమోదవుతున్నాయి. బుధవారం ఆ సంఖ్య 13,659కి చేరాడంతో ఈ ఏడాదిలో ఇదే అత్యధికం అయ్యింది. ప్రధాన నగరాలైన ముంబయిలో 1,539, పుణెలో 1,384, నాగ్‌పూర్‌లో 1,513, నాసిక్‌లో 750, యావత్మల్‌లో 403, ఔరంగాబాద్‌లో 560 కరోనా కేసులు వెలుగుచూశాయి.

రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించే దిశగా ప్రభుత్వం యోచిస్తుంది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు మరికొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఇంకా అదుపుతప్పలేదు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు విదించే విషయంలో నిర్ణయం తీసుకోనున్నాం’ అని ఆయన అన్నారు.