ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారిని శివరాత్రి పర్వదినాన దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తుండడంతో శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జాము నుంచే స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారు మోగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా వేకువజాము నుంచే మొదలయ్యాయి. భక్తులు బారులు తీరి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటారు. దీనికి స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.