ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సంతోష్ అనే వ్యక్తి ఇంటి వద్ద శ్వేత నాగు దర్శనం ఇవ్వడంతో భక్తుల ఆనందానికి అవధి లేకుండా పోతోంది. ఈ సంఘటన జిల్లాలో లక్సెట్టిపేటలో జరిగింది. ఈరోజు మహా శివరాత్రి కావడం శివుని మెడలో నాగుపాము ఉంటుందన్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల ప్రత్యేకంగా నాగేంద్రుడికి పూజలు చేస్తున్న తరుణంలో ఇలా జరగడం తో విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. అసలు నాగుపాము జాతులలోనే శ్వేతనాగులు అరుదుగా కనిపిస్తాయి. అలాంటిది శివరాత్రి రోజే శ్వేతనాగు కనిపిస్తే? ఇంకేముంది ఈ విశేషాన్ని చూడడానికి జనం భారీగా తరలివచ్చారు. ఆ శ్వేత నాగును చూసి తరించారు, పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు.

పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చి చేరడంతో కాలనీ వాసులు స్నేక్ క్యాచర్స్‌ను పిలిపించగా
వారు పామును పట్టుకుని అడవిలో వదిలేశారు.