భారత దేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమం శుక్రవారం పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. దీనితో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను ముందుగా గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.