క్రైమ్ (Crime) వార్తలు (News)

ఒకే డ్రైవర్ 12 రోజుల్లో 2 ప్రమాదాలు.. తప్పెవరిది?

మార్చి 30న నిజామాబాద్‌ జిల్లా గ్రామీణ మండలం మల్లారం గ్రామ కార్యదర్శి ఉమాకాంత్‌ను టిప్పర్‌ ఢీకొనడంతో చనిపోయారు. ఆ కేసులో పోలీసులు టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ గంగాధర్‌ను అదుపులో తీసుకోగా అదే రోజు బెయిల్‌పై విడుదలై బయటకు వచేసాడు. టిప్పర్‌ను మూడ్రోజుల కిందట అతనికి తిరిగి అప్పగించారు. ఈ నేపథ్యంలో శనివారం నిజామాబాద్‌ నగరంలోని ఇంద్రాపూర్‌ సమీపంలో సైకిల్‌పై వెళ్తున్న నక్క కృష్ణ(46)ను టిప్పర్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరోసారి ప్రమాదానికి అదే డ్రైవర్ కారణమవడంతో డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు చేయాలని రవాణాశాఖ అధికారులకు సిఫార్సు చేయనున్నట్లు ఎస్సై జాన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకే డ్రైవర్‌ కారణంగా 12 రోజుల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవాదం కడు దురదృష్టకరం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.