మహారాష్ట్రలో శనివారం దాదాపు 58,993వేల కేసులు నమోదవడంతో ఇప్పటి వరకు మొత్తం 32.88లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో 301మరణాలు నమోదు కాగా 45,391 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 5.36లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రమాదకర స్థాయిలో కరోనా వైరస్ పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ విధించే అవకాశమున్నట్లు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నుంచి సంకేతాలు వెలువడ్డాయి. లాక్‌డౌన్‌ పరిధి, ఎన్నిరోజులు, ఎలా అనే విషయాలు త్వరలో ఖరారు చేస్తామని మంత్రి అశోక్‌చవాన్ తెలిపారు.