ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో సెక్టార్‌ 63 సమీపంలో మురికి వాడల్లో భారీ మంటలు చెలరేగి దాదాపు 150కి పైగా గుడిసెలు దగ్ధం కాగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో బహ్లోల్‌పూర్‌‌ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు ఆర్పడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించవలసి వచ్చింది.