టెక్నాలజీ (Technology) వార్తలు (News)

స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టు సర్వే ఏప్రిల్ 20 వరకు పొడిగింపు

మున్సిపల్ కార్పొరేషన్ లు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టు చేపట్టనున్న విషయం పాఠకులకు తెలిసిందే! ఈ స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టుకు ప్రజల నుండి భారీ స్పందన లభిస్తుంది. అన్ని వసతులతో లేఅవుట్లు వేసి లాభాపేక్ష లేకుండా ప్లాట్లు విక్రయించే ఈ ప్రాజెక్టు పట్ల మధ్య తరగతి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు.

ఈ నెల 1 నుంచి 10 వరకు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో నిర్వహించిన డిమాండ్ సర్వే లో మొత్తం 2 ,32 ,369 ప్లాట్లకు ఆసక్తి కనబరుస్తున్నారు. వార్డు సచివాలయాలు యూనిట్జ్ గా ఈ డిమాండ్ సర్వే నిర్వహించి ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు చొప్పున మాత్రమే సర్వే లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. స్మార్ట్ టౌన్ల పట్ల రాష్ట్రంలో పట్టణ ప్రాంత ప్రజల నుంచి ఊహించిన దానికంటే భారీ డిమాండ్ వ్యక్తమవుతోంది.

డిమాండ్ సర్వేకు చివరి రోజు అని ముందుగా ప్రకటించిన ఒక్క ఆదివారమే ఏకంగా 74 వేల ప్లాట్లకు ప్రజల నుండి సుముఖత వ్యక్తం అవుతుంది. వరుస సెలవులు కూడా రావడంతో డిమాండ్ సర్వేను పొడిగించాలని పలువురు పురపాలక శాఖను కోరగా సర్వే ను ఈ నెల 20 వరకు పొడిగించినట్లు రాష్త్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ వి. రాముడు తెలిపారు.
డిమాండ్ సర్వే పూర్తి చేసాక స్మార్ట్ టౌన్ల ప్రాజెక్ట్ ఫై పురపాలక శాఖ తుది అంచనాకు వస్తుంది. దాని ప్రకారం భూ సేకరణ నిర్వహించి అనంతరం నోటిఫికేషన్ జారీ చేసి ప్లాట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు, నిబంధనలు, ప్లాట్ల కేటాయింపు విధి విధానాలు ఆ నోటిఫికేషన్ లో ప్రకటిస్తారు.

జిల్లాలవారీగా ప్లాట్ల కోసం డిమాండ్ (ఆదివారం నాటికి )..

జిల్లా – ప్లాట్లు
కర్నూలు – 28,238
విశాఖపట్నం – 25,806
అనంతపురం – 24,995
వైఎస్సార్ – 22,969
కృష్ణ – 22,757
తూర్పు గోదావరి – 20,403
గుంటూరు – 16,063
విజయనగరం – 13,825
నెల్లూరు – 13,127
ప్రకాశం – 12,౬౪౩
చిత్తూరు – 11,645
శ్రీకాకుళం – 10,654
పశ్చిమ గోదావరి – 9,244
మొత్తం – 2,32,369

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.