విశాఖ జిల్లా మాడుగులలోని నూకాలమ్మ దేవాలయ పరిసర ప్రాంతాల్లో అమ్మవారి జాతర ఉండటంతో ఆలయానికి చాలామంది భక్తులు దర్శనార్ధమై వచ్చారు. అలాంటి సమయంలో దేవాలయ పరిసర ప్రాంతాల్లో పది అడుగుల భారీ కింగ్‌ కోబ్రా (నల్ల త్రాచు) కనిపించి కలకలం సృష్టించింది. ఆలయానికి వచ్చిన భక్తులు తొలుత ఆ భారీ సర్పాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. అనంతరం వన్యప్రాణి సంరక్షకుడు పి.వెంకటేశ్‌కు సమాచారమివ్వడంతో ఆయన ఘటనాస్థలికి చేరుకొని కింగ్‌ కోబ్రాను బంధించగా అటవీ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో తాటిపర్తి పరిసర అటవీ ప్రాంతంలో సురక్షితంగా దాన్ని విడిచిపెట్టారు.