క్రైమ్ (Crime) వార్తలు (News)

డివైడర్‌ను ఢీకొన్న బస్సు

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దినాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను టెక్కలి, పలాస ప్రైవేటు ఆస్పత్రులకు తరలించినట్టు నందిగాం ఏఎస్సై మురళీకృష్ణ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.