టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

వయసు ఆరేళ్ళు .. జ్ఞాపకశక్తికి జోహార్లు..!!

హరియాణాలోని పంచకులకు చెందిన ఆర్నా గుప్తా అనే ఆరేళ్ల చిన్నారి తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో అబ్బురపరుస్తుంది. గుక్క తిప్పుకోకుండా విమాన సర్వీసుల పేర్లు చెబుతూ ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. వలం విమానాల వెనక భాగాన తోకలపై ముద్రించిన చిత్రాల ఆధారంగా ఏకంగా 93 విమాన సర్వీసు సంస్థల పేర్లను నిమిషం వ్యవధిలోనే దాదాపు 100 సర్వీసుల పేర్లు చెప్పి ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

తాజా రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని ఈ నెల 1న ఆమె అందుకుంది. విమాన సర్వీసులు చెబుతున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ పోస్టు చేయగా దానిలో తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ రికార్డు సాధించగలిగినట్లు ఆర్నా తెలిపింది. తమ కుమార్తెకు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ఉన్నట్లు తాము ముందే గుర్తించామని, భవిష్యత్‌లో ఏదైనా గొప్పగా సాధించగలదనే విశ్వాసంతో అప్పటి నుంచి ఆమెను ప్రోత్సహిస్తున్నట్లు తల్లి నేహా గుప్తా పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •