వార్తలు (News)

కూకట్ పల్లి కెమికల్ ఫ్యాక్టరీ లో భారీ అగ్ని ప్రమాదం!!

హైద్రాబాద్ కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్ లో శనివారం ఒక కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం కారణంగా చేలరేగిన మంటలకు కెమికల్ డ్రమ్ములు పేలిపోవడంతో పెద్ద పెద్ద శబ్దాలు విన్పించాయి. ఈ అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఫైటర్లు ఫ్యాక్టరీలో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కెమికల్ డ్రమ్ములు పేలిన శబ్దాలతో స్థానికులు భయబ్రాంతులకు గురౌతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఫ్యాక్టరీల్లో ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకొన్నారా లేదా అనే విషయాన్ని కూడ ఫైర్ సిబ్బంది పరిశీలించనున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •