అంతర్జాతీయం (International) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

లంక ఆటగాళ్లకు నెగిటివ్‌.. రేపటి నుంచి బయోబుడగలోకి ప్రవేశం..!!

టీమ్‌ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ నేపథ్యంలో శ్రీలంక జట్టు ఆటగాళ్లందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఫలితాల్లో నెగిటివ్‌గా తేలిందని ఆ బోర్డు వెల్లడించింది. ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న లంక జట్టులో బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌తో పాటు డేటా అనలిస్టు నీరోషన్‌కు గతవారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆటగాళ్లకు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో అందరికీ నెగిటివ్‌ వచ్చిందని ఆ బోర్డు అధికారి ఒకరు ‘పీటీఐ’తో అన్నారు. దాంతో సోమవారం వారిని బయోబుడగలోకి అనుమతించే అవకాశం ఉందన్నారు.

‘మాకు ఎవరి గురించైనా పాజిటివ్‌ రిపోర్టు వస్తే వెంటనే మేం బయటకు తెలియజేస్తాం. నిన్న వారికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆ ఫలితాలు ఈరోజు రావాల్సి ఉంది. కానీ పాజిటివ్‌ కేసులుంటేనే మాకు రిపోర్టులు వస్తాయి. ఇప్పటికైతే ఎలాంటి రిపోర్టులు అందలేదు. కాబట్టి, అందరికీ నెగిటివ్‌ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అంతా సవ్యంగా సాగితే యూకే నుంచి వచ్చిన ఆటగాళ్లు కఠిన క్వారంటైన్‌ నుంచి బయటకు వచ్చి బయోబుడగలోకి ప్రవేశిస్తారు. అలాగే వారికి నిబంధనల ప్రకారం ప్రతి మూడు, ఐదు రోజులకోసారి కరోనా పరీక్షలు జరుగుతూ ఉంటాయి’ అని ఆ అధికారి పేర్కొన్నారు.

ఇక టీమ్‌ఇండియాతో 18 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ముందు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, తొలుత ఈ సిరీస్‌ 13 నుంచే ప్రారంభంకావాల్సి ఉంది. ఫ్లవర్‌, నీరోషన్‌కు పాజిటివ్‌గా తేలడంతో ఐదు రోజులు వాయిదా వేశారు. దీంతో వచ్చే ఆదివారం నుంచి భారత్‌, లంక జట్లు వన్డే సిరీస్‌ ఆడనున్నాయి. ఆపై టీ20 సిరీస్‌లోనూ తలపడనున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •