వార్తలు (News)

70 రోజుల తర్వాత ప్రారంభమైన నెహ్రూ జులాజికల్‌ పార్క్‌!!

కరోనా కారణంగా 70 రోజుల నుండి మూతపడిన నెహ్రూ జులాజికల్‌ పార్క్‌ తిరిగి ప్రారంభం కావడంతో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతిస్తున్నారు. అయితే ప్రారంభమైన మొదటి రోజు మధ్యాహ్నం వరకు దాదాపు 1100 మంది పర్యాటకులు జంతు ప్రదర్శనశాలను సందర్శించినట్టుగా తెలుస్తుంది.

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతిస్తున్నారు. టికెట్‌ కౌంటర్ల వద్ద భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్‌ కాలంలో పార్కును శుభ్రంగా ఉంచామని, జంతువులు ఉండే ఎన్‌క్లోజర్లను రోజుకు పలుమార్లు శానిటైజ్‌ చేస్తామని, వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా పార్కులో ఉమ్మిన వారికి రూ.100 జరిమానా విధిస్తామని, మాస్కులు లేకుండా తిరిగితే ఫైన్‌ విధించి బయటకు పంపుతామని తెలిపారు.
అలాగే సరీసృపాలు, నిషాచర జంతుశాల, ఎక్వేరియం, ఫాజిల్‌ మ్యూజియం మూసివేశామని అధికారులు తెలిపారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జంతు ప్రేమికులు, సందర్శకులు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా పార్కులో తిరుగుతున్నారు. చాలా రోజుల తర్వాత జంతువులను చూసి చిన్నారులు ఆనందంతో గంతులు వేశారు. బుల్లి ట్రైన్‌లో కూర్చుని పార్క్‌ మొత్తం తిరుగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •